"ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు." మార్కు Mark 7:37
పల్లవి: భక్తులారా స్మరియించెదము - ప్రభుచేసిన మేలులన్నిటిని
అడిగి ఊహించు వాటికన్న - మరి సర్వము చక్కగ జేసె
1. శ్రీయేసే మన శిరస్సై యుండి - మహాబలశూరుండు
సర్వము నిచ్చెను తన హస్తముతో - ఎంతో దయగల వాడు
2. గాలి తుఫానులను గద్దించి- బాధలను తొలగించే
శ్రమలలో మనకు తోడైయుండి - బయలు పరచె తన జయమున్
3. జీవ నదిని ప్రవహింపజేసె - సకల స్థలంబుల యందు
లెక్కకుమించిన ఆత్మలతెచ్చె - పభువే స్తోత్రార్హుండు
4. అపోస్తలుల, ప్రవక్తలను - సువార్తికులను యిచ్చె
సంఘము అభివృద్ధిని చెందుటకు - సేవకులందరినిచ్చె
5. మన పక్షమున తానే పోరాడి - సైతానును ఓడించె
ఇంతవరకును ఆదుకొనెనుగా - తన మహాత్మ్యము జూపె
6. ఈ భువియందు జీవించుకాలము - బ్రతికెదము ప్రభుకొరకే
మనమాయన కర్పించుకొనెదము - ఆయన ఆశయమదియే
7. కొంచెము కాలమే మిగిలి యున్నది - ప్రభువును సంధించుటకై
గనుక మనము నడచుకొనెదము - ప్రభు మార్గముల యందు
تعليقات