top of page
Writer's pictureSamuel I

దేవుని ఆశ్చర్య కార్యములను అందరు చూడండి Song Lyrics


పల్లవి: దేవుని ఆశ్చర్య- కార్యములను

అందరు చూడండి కీర్తింతుము రండి (2)


1. ఆశ్చర్యకరుడు యేసు - ఆశ్చర్య క్రియలు చేసెన్ (2)

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి (2) ||దేవుని||


2. ఆశ్చర్య మాటలు పల్కెన్ - అనేకుల కాశ్చర్యమాయేన్

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ||దేవుని||


3. ఆశ్చర్య జ్ఞానమునిచ్చున్ - ఆలోచన శక్తియునిచ్చున్

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ||దేవుని||


4. ఆశ్చర్యపడిరి ఎంతో - లేచిన ప్రభువును చూచి

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ||దేవుని||


5. శ్రమ నొంది సిలువపై - మౌనము వహించెనేసు

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ||దేవుని||


6. క్రీస్తుకై శ్రమ నొందుచు - సహించుము అన్నిటిని

ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి ||దేవుని||


7. ఆశ్చర్యకరుడు పిల్చెన్- ఆలకించి రమ్మువేగమే

అధ్భుతములను - అనుభవించి పాడుము హల్లెలూయా ||దేవుని||





80 views0 comments

Yorumlar


bottom of page