top of page
Writer's pictureSamuel I

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి Song

పల్లవి: హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి


అ. పల్లవి: రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి


1. తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల||


2. సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి ||రాజుల||


3. యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి ||రాజుల||


4. అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి ||రాజుల||

3 views0 comments

Comments


bottom of page