top of page
Writer's pictureSamuel I

యెహోవా నీ కృపయే దయాదీర్ఘశాంతమే Song Lyrics

పల్లవి: నీ కృపయే దయాదీర్ఘశాంతమే (2)

ఎన్నడు విడువదు నన్నెన్నడు ఎడబాయదు (2)

ఇమ్మానుయేలుగా నాకు తోడైయున్నావు (2) ||యెహోవా||


1. కృపయును సత్యమును - క్రీస్తుయేసు ద్వారా కలిగెను (2)

ఆ వాక్యమే శరీరధారియై మనతో నుండెను (2)

కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్యలో వసియించెను (2) ||యెహోవా||


2. నీవెన్నడు భయపడకుము - దిగులు నీవు చెందకుము

నా కృప నీకు చాలునని ధైర్యము నొసగితివి

నీవే నన్ను ఆదుకొని - రక్షించితివి యేసయ్యా ||యెహోవా||


3. ప్రభువా మాదు కేడెము - మా కృపానిధి నీవే

అత్యధికమైన కృపతో మమ్ముల కాయుచుంటివి

మా కోటయు మా దుర్గము నీవే - ఆరాధింతుము యేసయ్యా ||యెహోవా||




6 views0 comments

Comentarios


bottom of page